తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
పలు డివిజన్లో అధ్యక్షుల నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాం తి): హైదరాబాదులోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikari Part) కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ చేరికలు(joinings), నూతన నియామకాల కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ ఇన్‌చార్జి, రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ భావన వెంకటేష్(R. Bhavana Venkatesh) ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) సమక్షంలో పలువురు పార్టీ లో చేరారు.
అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షుడిగా ఎ మురళి, సీతాఫల్మండి డివిజన్ అధ్యక్షుడిగా టి శ్రీనివాస్ చారి, కవాడిగూడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ఎ సుమన్ కుమార్, కవాడిగూడ డివిజన్ జనరల్ సెక్రటరీగా పి ప్రజా పతి, బేగంపేట్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా వి అర్జున్లను నియమిస్తూ మల్లన్న నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి. కిషోర్ కుమార్ గౌడ్, రెహ్మత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు రామన్ గౌడ్ పాల్గొన్నారు.






