5 September, 2026 | 6:46 AM

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖరారైందా?

05-09-2026 | 05:25am
  1. మారిన మునుగోడు ఎమ్మెల్యే స్వరం 
  2. ప్రొఫైల్ పిక్‌లో రాహుల్ ఫొటో 
  3. పార్టీలోని పరిణామాలపై ఆచితూచి స్పందన 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy) స్వరంలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వం(Government), పార్టీలోకూడా ఏమైనా  తప్పిదాలుంటే.. వాటిపైన  ముక్కుసూటిగా మాట్లాడే రాజగోపాల్‌రెడ్డి.(Rajagopal Reddy). ఇప్పుడు కాస్త ఆలోచించి, ఆచి తూచి మాట్లాడుతున్నారని కాంగ్రెస్(Congress) వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. అందుకు ప్రధాన కారణం ఏంటి? అనేదానిపైన రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

రాష్ట్ర క్యాబినెట్‌లో(State Cabinet) గత రెండున్నరేళ్లుగా రెండు బెర్తులు ఖాళీ గా ఉండగా, ఇప్పుడు కొండా సురేఖను(Konda Surekha) మంత్రివర్గం నుంచి బర్తరఫ్(dismissal) చేయడంతో ఆ సంఖ్య మూడుకు చేరింది. ఖాళీగా ఉన్న ఈ మూడు బెర్తులను త్వరలోనే భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం(Congress high command,) దృష్టి సారించింది. మంత్రివర్గ విస్తరణ ఎప్పు డు జరిగినా.. అందులో బెర్తు ఖాయమని రాజగోపాల్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం  నుంచి సంకేతాలు అందడం వల్లనే గత రెండు, మూడు రోజులుగా తన మాటల స్పీడ్‌ను తగ్గించారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

తాజాగా రాజగోపాల్‌రెడ్డి తన మొబైల్‌లోని సామాజిక మాధ్య మాల ఫ్లాట్‌ఫాంల్లో ప్రొఫైల్ పిక్‌కు రాహుల్‌గాంధీ ఫొటోను చేర్చుకున్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను అధిష్ఠానం కాపాడుతుందనే నమ్మకం ఉందంటూ ఆయన ఇటీ వల చేస్తున్న ఈ వ్యాఖ్యల వెనుక ఏదో మతలబు ఉందనే గుసగుసలు రాజకీయ సర్కి ల్స్‌లో వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి, ఎ మ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లారు.

ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన రాజగోపాల్‌రెడ్డి ఓటమి చెందారు. ఇక 2023లో జరిగిన అ సెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాం గ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అ యితే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు.. పార్టీ అధికారంలోకి రాగానే మం త్రి పదవి ఇస్తామని హస్తిన పెద్దలు హామీ ఇచ్చారని,  ఇప్పుడు ఆ హామీని ఎందుకు విస్మరిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి పలుమా ర్లు పార్టీ నేతలను ప్రశ్నిస్తూ.. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిపైన కూడా తీవ్రంగానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా కొండా సురేఖను మం త్రి పదవి నుంచి తప్పించిన అంశంపై రాజగోపాల్‌రెడ్డి స్పందిస్తూ.. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై ఏమి మా ట్లాడలేమని చెబుతున్నారు. అంతే కాకుండా పార్టీ అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తే తీసుకుంటాను.. లేదంటే ప్రజల తరపున మాట్లాడుతానన్నారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి మంత్రిగా ఉండటంతో.. ఒకే ఇంట్లో ఇద్దరికి వద్దు అనే విషయంతోనే ఆలస్యమవుతోందని చెప్పారు.

‘నా సోదరుడిని ఒప్పించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒకే.. లేదంటే మంత్రి పదవి లేకపోయినా పర్వాలేదు’ అని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డిని తానెప్పుడు తిట్ట లేదంటున్నారు. గతంలో తాను, బీజేపీలో ఉన్నప్పుడు.. తనపై విమర్శలు చేసినప్పుడే స్పందించానని, రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక వ్యక్తిగతంగా ఏమీ అనలేదని చెబుతున్నారు. తానే పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి అన్నప్పుడు.. జాతీయ పార్టీలో ఇలాంటి ప్రకటనలు సరికాదని మాత్రమే చెప్పానని గుర్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు