5 September, 2026 | 5:58 AM

డ్రగ్స్‌వాడిన పైలెట్

05-09-2026 | 05:10am

ఫుకెట్ ఘటనలో ఏఏఐబీ నివేదిక వెల్లడి

కఠిన చర్యలు చేపట్టాలని డీజీసీఏకు సిఫార్సు

పైలెట్‌ను తొలగించిన ఏర్ ఇండియా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళుతున్న ఏయిర్ ఇండియా విమానం(Air India Aircraft) భారీ కుదుపులకు లోనైన ఘటనలో విమానం పైలట్ డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (Aircraft Accident Investigation Bureau) ప్రాథమిక నివేదిక సమాచారం శుక్రవారం వెల్లడైంది. దీంతో ఏయిర్ ఇండియా పైలెట్‌ను తొలగించింది.

ఎయిర్ బస్ విమానం ఫ్లుటై కంట్రోల్ సిస్టమ్ మూడు హైడ్రాలిక్ సిస్టమ్‌లోనూ లోపాలను కూడా గుర్తించినట్లు, దర్యాప్తు పూర్తి అయిన తరువాత నివేదిక జారీ చేస్తామని ఏఏఐబీ అందులో పేర్కొంది. ఆగస్ట్ 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం భువనేశ్వర్ సమీపంలో అకస్మాత్తుగా 300 అడుగులు కిందకి దిగింది. విమానంలో 145 మంది ఉండగా, 24 మంది గాయాలయ్యాయి.

విమానం లోపలి భాగాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. విమానం ల్యాండింగ్ అనంతరం పైలెట్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ప్రధాన పైలెట్ శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించినట్లు నివేదికలో వెల్లడించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఏఏఐబీ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.


మరిన్ని వార్తలు