7 July, 2026 | 3:37 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

హత్యాయత్నం కేసులో ఐదుగురిని అరెస్ట్

07-03-2026 07:16 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం నెహ్రూ బస్తి రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) సంవత్సరాలు అను వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. నిందితులను శనివారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను వన్టౌన్ సిఐ కరుణాకర్ వెల్లడించారు. రైలు పట్టాల వద్ద ఉన్న కిరాణా దుకాణం వద్ద స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న, నరేష్ పై నాతరి శ్రీనాథ్, లోకేష్, శివ సంజయ్, వసుకుల ఉదయ్, నాతరి రాజేశ్వరరావు, ఐలయ్య లు రోకలి బండతో నరేష్ తలపై గట్టిగా కొట్టడంతో, అతను తీవ్రంగా గాయపడ్డాడు.

తలకు పలుచోట్ల గాయాలు కావడంతో స్పృహ కోల్పోయి, ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు. వైద్యం నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి నరేష్ ను తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నరేష్ పరిస్థితి విషమంగా మారింది. నెహ్రూ బస్తీ ఏరియాలో నిర్మల అనే మహిళకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని, ఐలయ్య కొన్ని నెలల క్రితం ఆక్రమించాడు.

అతని వద్ద నిర్మల రూ 4 లక్షల అప్పుగా తీసుకుంది. ఆమెకు అనారోగ్యం కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లడంతో అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో గత 18 నెలల నుండి, ఆ ఇంట్లో ఐలయ్య కుటుంబంతో ఉంటున్నాడు. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా, ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టాడు. ఈ విషయంలో నిర్మలకు నరేష్ సపోర్ట్ చేశాడని కక్ష పెంచుకొని ఉద్దేశపూర్వకంగా, నరేష్ పై దాడి చేసిన ఐదుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసికి రిమాండ్ కు తరలించారు.