అక్కెనపల్లి మోడల్ స్కూల్లో ఘనంగా ఫ్రెషర్స్ డే
21-08-2026 01:47 AM
నంగునూరు, ఆగస్టు 20 (విజయక్రాంతి): నంగునూరు మండలం అక్కెనపల్లి పీఎం శ్రీ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, 6 వ తరగతిలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో మండల విద్యాధికారి శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఉజ్వల భవిష్యత్తును సాధించాలని పిలుపునిచ్చారు.
పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లెక్చరర్లు,సీనియర్ విద్యార్థులు పాల్గొని జూనియర్ విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.






