గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబులాపూర్ గ్రామ శివారులో గోదావరి నది ఒడ్డున నాలుగు రోజుల క్రితం లభ్యమైన గుర్తు తెలియని మహిళ మృతదేహానికి పోలీసులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలి వయస్సు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ నోట్లు, సోషల్ మీడియా, ఇతర సమాచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఇప్పటివరకు మృతురాలి బంధువులు లేదా సంబంధిత వ్యక్తులు ఎవరూ రాలేదు.ఈ నేపథ్యంలో చట్టపరమైన నిబంధనల ప్రకారం శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం మెట్ పల్లి మున్సిపాలిటీ సిబ్బంది,పోలీసుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు.మృతురాలికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే లేదా ఆమెను గుర్తించే అవకాశం ఉన్నట్లయితే వెంటనే మల్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.






