గణేశ్ లడ్డూ 2 లక్షల 6 వేలు
20-09-2026 | 08:38pm
దమ్మపేట, సెప్టెంబర్ (విజయ క్రాంతి): వినాయక చవితి నవరాత్రి (Vinayaka Chavithi Navratri) ఉత్సవాలలో భాగంగా మొద్దులగూడెం కొత్తరామాలయం వీధిలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట అత్యంత ఉత్కంఠతో హోరా హోరీగా సాగింది. భక్తులు పోటాపోటీగా పాల్గొన్న ఈ వేలం పాటలో మొద్దులగూడెం గ్రామానికి చెందిన బచ్చు సత్యనారాయణ అత్యధికంగా ₹2,06,000 (రెండు లక్షల ఆరు వేల రూపాయలు) కు లడ్డూను కైవసం చేసుకున్నారు. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.