10 April, 2026 | 12:30 PM

Breaking News

గంజాయి స్వాదీనం

10-04-2026 10:27 AM

పలువురు అరెస్ట్ 

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో(Pebbair Police Station Limits) గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. గురువారం ఉదయం అందిన సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో కొంత మందిని అరెస్ట్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాలలో.. ఉదయం 10 గంటల సమయంలో బాలాజీ ధాబా సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మకానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే పై అధికారులకు తెలియజేశారు. అనంతరం  తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ పంచులతో పాటు క్లూస్ టీం సహాయంతో అక్కడికి చేరుకున్నారు. సుమారు 11 గంటల సమయంలో అనుమానితులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారి పేర్లు ప్రవీణ్ కుమార్, బబ్లు కుమార్ సింగ్ అని, ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారని వెల్లడైంది. వీరు ఇటీవల బాలాజీ రైస్ మిల్‌లో పని చేస్తూ గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి నాలుగు ప్యాకెట్లు (మొత్తం 16 గ్రాములు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వారి సమాచారంతో పోలీసులు షేరుపల్లి సమీపంలోని సప్తగిరి రైస్ మిల్ వద్ద హమాలి గా పనిచేస్తున్న ధీరజ్ ఠాకూర్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 12 ప్యాకెట్లు (48 గ్రాములు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ధీరజ్ ఠాకూర్ బీహార్‌కు చెందిన రణవీర్ అనే వ్యక్తి వద్ద నుంచి సుమారు 250 గ్రాముల గంజాయి తెచ్చి, ప్రవీణ్ మరియు బబ్లు ద్వారా విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు.మొత్తం కేసులో 64 గ్రాముల గంజాయి, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయి వినియోగిస్తున్నట్లు తెలిపిన వైశాకాపూర్ గ్రామానికి చెందిన అజిత్ నాయుడు, రాకేష్, అలాగే పెబ్బేరు కు చెందిన వెంకటేష్, చింతకాయల శివలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.