గణపతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించాలి

13-09-2026 | 12:00am

డీజేలకు అనుమతులు లేవు.. 

నిబంధనలు పాటించాలి: డీఎస్పీ శ్రీనివాసులు

కోనరావుపేట,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను(Ganpati Navratri celebrations) భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు(DSP Srinivasulu) సూచించారు. కోనరావుపేట(Konaraopet)లో వినాయక మండపాల నిర్వాహకులకు ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.

మండపాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. గణపతి నిమజ్జనం సమయంలోనూ పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు.ఉత్సవాల్లో డీజేలకు అనుమతులు లేవని డీఎస్పీ శ్రీనివాసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజలు, భక్తులు, మండపాల నిర్వాహకులు సమన్వయంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సిఐ రవీందర్ ఎస్సై రామ్మోహన్ విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు