స్వచ్ఛ భారత్‌కు ఎడ్లబండి!

10-09-2026 | 04:50am

నిధులు లేమితో సర్పంచ్‌లు ఆందోళన

పలు గ్రామాల్లో మూలకు చేరిన ట్రాక్టర్లు 

పెండిపల్లిలో ఎడ్లబండిపై చెత్త సేకరణ 

సర్పంచ్ శ్రీను వినూత్న నిరసన 

నిర్మల్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): నిధులు లేవని దిగులు చెందలేదు ఆ సర్పంచ్. డీజిల్‌కు డబ్బులు లేవని దిక్కులు చూడలేదు. గ్రామంలో చెత్త సేకరణపై చేతులెత్తే యలేదు. పారిశుధ్య పనుల(Sanitation works) నిర్వహణకు ప్లాన్ వేశాడు. స్వతహాగా రైతు కావడంతో తన ఎడ్లబండినే చెత్త ట్రాక్టర్‌గా మార్చాడు. ఇంటింటికి వెళ్లి ఎడ్లబండిపైనే చెత్త సేకరించాడు. నిధుల లేమిపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.

నిర్మల్ జిల్లా భైంసా మండలం పెండిపల్లి గ్రామ సర్పంచ్ దేశెట్టి శ్రీనివాస్ పారిశుధ్య కార్మికుడిగా మారిపోయాడు. నిధులు లేమితో చెత్త సేకరించే ట్రాక్టర్ ఇంధనానికి డబ్బులు ఎడ్లబండిపై చెత్త సేకరించి, డంపుయార్డుకు తరలించారు. పంచా యతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మం జూరు చేస్తున్నా అవసరాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించ డం వలన ఈ పరిస్థితి తలెత్తిందని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు.

ప్రతిరోజు చెత్త సేకరణకు ట్రాక్టర్ వినియోగించడం వల్ల డీజిల్‌కు 500 వరకు ఖర్చు అవుతుందని బడ్జెట్ లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తన ఎడ్లబండిని చెత్త సేకరణకు వాడుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ అవసరాలకు ని ధులు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా గ్రామాల్లో చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లలో డీజిల్ పోయలేక సర్పంచులు మూలన పడేశారు. కొన్ని గ్రామాల్లో వారానికి మూడు రోజులు మాత్రమే చెత్త సేకరిస్తున్నట్టు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు