లబ్ ప్రారంభం
జేజే ఆర్ట్ మూవీస్(JJ Art Movies), పవనసుత ప్రొడక్షన్స్(Pavanasuta Productions), గాయత్రి సినిమాస్ బ్యానర్లు(Gayatri Cinemas banners) ‘లబ్’ (#LUB) అనే పేరుతో ఒక కొత్త రూపొందుతోంది. మహేశ్‌కుమార్ సంక, భగవాన్ నిర్మాతలు. మణికంఠ పెదమల్లు తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా పవన్ కేసరి(Pawan Kesari), ప్రాముఖ్య హీరోహీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. అభితేజ్, జెడివి ప్రసాద్, మల్లిక లెల్ల, సాయికిరణ్, ‘రోమాంచకం’ ఫేమ్ మధు, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఫేమ్ హారిక, భాను ప్రకాశ్ కడియాల, మోత రాజేందర్ కీలక పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి అక్షయ్ వసూరి డీవోపీ, కార్తికేయన్ రోహిణి ఎడిటర్, సుధ శ్రీనివాస్ సంగీత దర్శకుడు, శ్రీనివాస మౌళి లిరికల్ రైటర్. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత బీవీఎస్ రవి, దర్శకులు సముద్ర, రోహిత్ కేపీ, నిర్మాతలు చైతన్యరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, లగడపాటి శ్రీనివాసరావు, శ్రీకాంత్ ఈ వేడుకకు హాజరయ్యారు.