మండల వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షునిగా గిరీష్ ఎన్నిక

20-09-2026 | 07:51pm

తూప్రాన్, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ ఫోరం స్టేట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నాగవెల్లి జ్యోతి (Mrs. Nagavelli Jyothi)ఆదేశాల మేరకు ఆదివారం మెదక్ జిల్లా ఇంచార్జ్ గాంతి అశోక్ అధ్యక్షతన వార్డ్ మెంబర్స్ ఫోరమ్ తూప్రాన్ మండల కమిటీని అధికారికంగా ఎన్నుకున్నారు. ఇందులో ముఖ్యంగా వార్డు మెంబర్ ఫోరమ్ మండల అధ్యక్షునిగా దాచారం గిరీష్ ను ఎన్నుకొనగా, ఉపాధ్యక్షులుగా చింతల స్వామి, ఎండి. లతీఫ్, సోషల్ మీడియా అధ్యక్షునిగా మొర ఆంజనేయులు జనరల్ సెక్రెటరీ గుర్రాల వేణు, కోశాధికారి చెట్లపల్లి సుదర్శన్, అల్లాడి రమేష్, రుద్రారం రేఖ ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. 

ఈ సందర్భంగా గాంతీ అశోక్ మాట్లాడుతూ వార్డు మెంబర్ల యొక్క హక్కుల కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని అధికారికంగా కేటాయించిన పదవులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో తూప్రాన్ మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు