నాడు సూయీజ్.. నేడు హోర్ముజ్
జూకంటి జగన్నాథం :
సూయీజ్ కాలువ(Suez Canal) మానవ నిర్మితమైనది. అయితే హోర్ముజ్ జలసంధి(Strait of Hormuz) సహజ సిద్ధంగా ఏర్పడినది. అటు సూయీజ్ కాలువ(Suez Canal) కానీ ఇటు హోర్ముజ్ జలసంధి గానీ ప్రపంచ వాణిజ్య రంగాన్ని(World trade sector) వివిధ దేశాల మధ్య సులభతరం చేయడంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్యం జలమార్గాల ద్వారా 80శాతం నుండి 90 శాతం వరకు జరుగుతున్నాయి.
ముందుగా సూయీజ్ కాలువ చరిత్రను దాని ప్రాముఖ్యతను తెలుసుకుం దాం. ఈజిప్టు మధ్యధరా సముద్రం ఫోర్త్ సైడ్ నుండి ఎర్ర సముద్రంలోని సూయీ జ్ పట్టణం వరకు 193 కిలోమీటర్ల పొ డవు ఉంటుంది. ఇది మధ్యధరా సముద్రా న్ని, ఎర్ర సముద్రం ద్వారా హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. దీనివల్ల ఆసి యా, యూరోప్‌ల మధ్య 8900 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఐరోపా నుండి ఆసియాకు వెళ్లే ఓడలు ఆఫ్రికా చుట్టు తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. 10-- రోజుల సమయం కూడా ఆదా అవుతుంది.
సూయీజ్ కాలువ నిర్మాణం 1859 ప్రారంభమై 1869 వరకు సుమారు 10 సంవత్సరములు జరిగింది. 17 నవంబర్ 1869 నుండి ఓడల ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. 1856 లో ఈ కా లువ నిర్మాణానాన్ని చేపట్టిన కంపెనీకి 99 సంవత్సరాలు నిర్వాహక హక్కులు కట్టబెట్టారు. ప్రపంచంలో అధిపత్యాన్ని చలాయి స్తున్న బ్రిటన్ 1875లో ఈజిప్టు దగ్గర వా టాలను కొని ఈ కాలువపై ఆధిపత్యాన్ని సంపాదించుకుంది. అయితే ఈజి ప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాజర్ 26 జూలై, 1956లో ఈ కాలువను జాతీయం చేశా డు. దీంతో బ్రిటన్.. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తో కలిసి ఈజిప్ట్‌పై దాడి చేసింది. ఇది సూ యీజ్ సంక్షోభంగా చరిత్రలో నమోదయింది. 1967--1975 మధ్య యు ద్ధం జరగడం వల్ల సుమారు 8 సంవత్సరాలు ఈ కాలువను మూసివేశారు. ప్రపం చ వాణిజ్యంలో ఈ కాలువ ద్వారా 12 శాతం నుండి 15శాతం వరకు వ్యాపారం జరుగుతున్నది.
అప్పటికే ప్రపంచంలో అగ్రరాజ్యాలు గా బలపడిన అమెరికా, సోవియట్ రష్యా దౌత్యపరంగా కలగజేసుకోవడంతో బ్రిటన్ వెనుకకు తగ్గింది. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది . దీంతో బ్రిటన్ ఫౌండ్ బలహీనపడి అమెరికా డాలర్ వాణిజ్య ప్రపం చంలో పైచేయి సాధించింది. అందువల్ల సూయీజ్ కాలువ ప్ర పంచ వాణిజ్యరంగంలో మిక్కిలి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇరాన్‌పై అమెరికా దాడికి ముందు మరొక ముఖ్య విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి. అది జనవరి 3, 2026 నా డు వెనెజులా అపార చమురు నిల్వలపై కన్నేసి అమెరికా ఏకపక్షంగా దండెత్తి ఆ దేశపు అధ్యక్షుడు మధు రోను బంధించి అక్రమంగా అమెరికాకు తరలించారు.
ఇకపోతే ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఫిబ్రవరి 28, 2026 నాడు ఇరాన్‌పై ఏకపక్షంగా దాడి చేసి ఆ దేశపు అధ్యక్షుడు ఆయతుల్లా ఖమేనిని అంతం చేశారు. వెనెజులా తరహాలోనే ఇరాన్ దేశాన్ని హస్తగ తం చేసుకోవచ్చని అమెరికా, ఇజ్రాయెల్ కుట్రపూరితంగా వ్యవహరించాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఇరాన్ తన సర్వ శక్తిసామర్థ్యాలను, బలగాలను మోహరిం చి అమెరికా, ఇజ్రాయెల్‌లకు చుక్కలు చూపించాయి. తమపై దాడి చేసిన దేశాల పన్నాగాలకు వ్యతిరేకంగా ఇరాన్ హోర్ము జ్ జలసంధి మార్గంలో తమ శత్రుదేశాల నౌకలను నిషేధించింది. అంతేగాకుండా జలసంధిపై తన ఆధిపత్యాన్ని, అధికారాన్ని మరోసారి ప్రకటించుకుంది.
ఇజ్రా యెల్, అమెరికా.. ఇరాన్‌పై దాడి చేయడంతో హోర్ముజ్ జలసంధి వెలుగులోకి వచ్చింది. ఈ జలసంధి సహజ సిద్ధమైనది. ముఖ్యంగా 20 వ శతాబ్దం ప్రారంభంలో పర్షియా గల్ఫ్ దేశాలలో ఆయిల్ సహజవాయువు ఉత్పత్తి ప్రారంభం కావడంతో సముద్ర వాణిజ్యంలో ఈ జల సంధి ప్రా ముఖ్యత పెరిగింది. జలసంధి ద్వారా మిగ తా ప్రపంచ దేశాలకు యూఏఈ దేశాల నుండి చమురు, సహజవాయువులను నౌకల ద్వారా సరఫరా చేసే ఒక ప్రముఖమైన ప్రధాన జల మార్గంగా అవత రించింది. పర్షియన్ గల్ఫ్ దేశాలకు అరేబియా సముద్రానికి మధ్య ఉన్న ఏకైక జల మార్గం ఇదొక్కటే కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ జలమార్గం ద్వారా 20 శాతం చమురు మరియు 25 శాతం ఎల్‌ఎన్‌జి ప్రపంచ దేశాకు సరఫరా అవుతుంది.
అమెరికా, ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసిపోతుందని భావించిన ఇరాన్ ఇం కా దీర్ఘకాలికంగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. పైగా గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కనివినీ ఎరుగని రీతి లో దాడులు చేసి ఆర్థికంగా అపార నష్టం కలగజేసింది. అమెరికా రక్షణరంగ నిపుణులు, సలహాదారులు తమ అధ్యక్షునికి ఇరాన్ శక్తిసామర్థ్యాలను తక్కువగా అం చనా వేయడం జరిగిందని చెప్పినప్పటికీ ట్రంప్ చెవికెక్కడ పోవడం విచారక రం. ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనిక ప్రాణనష్టం ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంది. అ మెరికా అగ్రరాజ్యంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించి తన వ్యాపార లాభాపేక్ష ఆధిపత్యాన్ని చూపెట్టుకుంటున్నది.
ప్రపం చ వాణిజ్య పటంలో డాలర్ ను పైచేయిగా ఉంచుతూ ఇంతకాలం కొనసాగిస్తూ వస్తున్నది. అమెరికా వద్ద అణ్వా యుధాలు ఉం టే ప్రపంచ శాంతి కోసం అంటుంది. ఇతర దేశాల వద్ద ఉంటే ప్రపం చ శాంతికి ము ప్పుగా భావించి ఏదో మి షతో ఆ దేశాలపై ఉగ్ర ప్రచారం చేస్తూ ఆర్థిక ఆంక్షలు విధి స్తూ నయాన భయానా ఒప్పందాల పే రున తన పబ్బం గడుపుకుంటున్నది. తన దారికి రాకుంటే యుదా నికి సిద్ధమవుతూ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నది. అమె రికా ద్వంద్వ వైఖ రిని ప్రపంచ దేశాలు గుర్తించి ఇప్పుడిప్పుడే అమెరికా వాణిజ్య ఒప్పందాలకు, పరోక్ష యుద్ధాలకు వ్యతిరేక కూటమిగా ఏర్పడుతున్నాయి.
కొండకచో గట్టిగానే నిలువరి స్తున్నాయి. తీరా ఇప్పుడు విశ్లేషిస్తే సూ యజ్ కాలువ మరియు హో ర్ముజ్ జలసంధి ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు మ రింత పెరిగాయి. అనంతర యుద్ధ పరిణామాల వలన గతంలో అగ్రరాజ్యా లు వాటి యొక్క స్థానాలు చరిత్రలో తారుమాయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సోవియ ట్ రష్యా, అమెరికా మరియు అగ్రరాజ్యాలు రెండు కూటములుగా ఏర్పడ్డాయి.
ఆయా యుద్ధ సమయాలలో జలమార్గాలు ప్రధాన భూమికను పోషించాయి. ఇప్పటికీ పోషిస్తున్నాయి. అమెరికాతో స హా పెట్టుబడి దేశాలు అన్నీ కూడా పైకి మే కపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ అంతరాంతరాలలో తీవ్ర సామాజిక సమస్య లతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒక విధంగా ఇరాన్ యుద్ధం త ర్వాత అమెరికా డాలర్ స్థానంలో మరొక కరెన్సీ ఆధిపత్యాన్ని చలాయించే స్థితిలో వాతావరణం గోచరిస్తున్నది. మొత్తానికి జలమార్గాలు వాణిజ్యాన్నే కాదు.. వాణిజ్య ఆర్థిక సంక్షోభాన్నీ కాదు. దేశాల స్థానాల ను గల్లంతు చేస్తాయని చరిత్ర చెప్పిన స త్యాలు.. మరోసారి నిరూపించబడుతుందేమో చూడాలి.
--- వ్యాసకర్త: కవి, రచయిత