17 April, 2026 | 11:55 AM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

సమస్య లేని కాలనీలుగా మార్చడమే లక్ష్యం

02-03-2026 01:43 PM

షాద్‌నగర్  ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ,

షాద్‌నగర్,(విజయక్రాంతి): ప్రతి వార్డును మరింత సుందరంగా మార్చేందుకు కృషి చేస్తానని, సమస్యలేని కాలనీలుగా మార్చడమే ముందున్న లక్ష్యం అని, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం కోసం కాలనీ వాసులందరూ  సహకరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapally Shankar) అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 7 వార్డు సాయి బాలాజీ టౌన్ షిప్ లో కాలని వాసులు ఏర్పాటు చేసిన  సమావేశానికి షాద్ నగర్  ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ , మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వవేశర్,వైస్ ఛైర్మన్ అంధే మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాలని రోడ్డు, డైనేజి,తాగునీరు, వంటి అంశాలపై కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  మున్సిపల్ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు తీసుకొస్తానని ఆయన తెలిపారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ , మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ల  ప్రవీణ్ కుమార్ , అప్పి, పెంటయ్యలను శాలువా లతో కాలనీ వాసులు సన్మానించారు.