ఆదిలాబాద్ బిడ్డకు డాక్టరేట్‌

12-09-2026 | 06:21pm

ఇచ్చోడ,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇచ్చోడ మండలం ఆడేగామా (కె) గ్రామానికి చెందిన గొల్లపల్లి ప్రవళిక ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి బోటనీలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. ప్రేమ్నా టోమెంటోజా మొక్కలోని ఫైటో కెమికల్‌, యాంటీ మైక్రోబియల్‌, ఫార్మ కాలాజికల్‌ గుణాలపై పరిశోధన చేశారు. 2018 నుంచి కేజీబీవీలో సేవలందిస్తూ పరిశోధన పూర్తి చేసిన ప్రవళికకు ఓయూ 85వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్ల చేతుల మీదుగా డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని ప్రవళిక తెలిపారు. ఆమె సాధనపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు