నిరుపేద గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలి
నిర్మల్ అక్టోబర్ 6 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గల గీతా పారిశ్రామిక సంఘంలో(Gala Geetha Industrial Association) అరులైన నిరుపేద గీత కార్మికులకు సభ్యత్వం ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.
ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దేవేంద్ర గౌడ్, జిల్లా అధ్యక్షులు వేణు గౌడ్, సంఘం బాధ్యులు పొన్నం నారాయణ గౌడ్ మాట్లాడుతూ నిర్మల్ పట్టణంలో సభ్యత్వ విషయంలో నిరుపేద గీతా కార్మికులకు అన్యాయం చేసి ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు వ్యాపారులకు సభ్యత్వం ఇస్తున్నారని వారు ఆరోపించారు.
గీతా వృత్తితో ఏమాత్రం సంబంధం లేని వారికి సభ్యత్వం ఇవ్వడం వల్ల నిజమైన గీతా కార్మికులకు అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. నిర్మల్ పట్టణంలో పెద్ద మొత్తంలో తెల్లగల్లు విక్రయాలు జరుగుతున్నాయని నిబంధనలు అతిక్రమించి ఎక్కువ దుకాణాలను నిర్వహిస్తున్న ఎక్సైజ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని వారు ప్రశ్నించారు. దీనిపై దశలవారీగా పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం బాధ్యులు పాల్గొన్నారు