ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం ప్రమాణ స్వీకారం
బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులు, డైరెక్టర్లు
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Malatummeda Primary Agricultural Cooperative Society)కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో నూతన పాలకవర్గానికి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగా మంగళవారం మాల్ తుమ్మెద సహకార సంఘం కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా కలాలి సురేందర్ గౌడ్తో పాటు నియామకమైన 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నియామకమైన పన్నెండు మంది డైరెక్టర్లు కొమ్మగల్ల భీమయ్య, షేక్ ఆసిఫ్, పెద్దపట్లోళ్ల మహేశ్వర్ రెడ్డి, గంపల వెంకయ్య, విట్టల్రెడ్డిగారి శ్రీనివాస్ రెడ్డి, మూడేరు సాయిరాం, సిద్దిగారి సుజాత, రాజపేట యాదగిరి, జి.సాయికుమార్, సిహెచ్. భూపాల్ రెడ్డి, పర్మల్ల దుర్గమ్మ, భారతి ప్రతిభలు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నూతన పాలకవర్గం సభ్యులు మాట్లాడుతూ...తమపై ఎంతో నమ్మకంతో ఉంచి మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాలకవర్గ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఈవో సందీప్ కుమార్,సొసైటీ సిబ్బంది,ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.