వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి
- నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ
- మద్దూరులో వికలాంగుల ధర్నా
మద్దూరు, అక్టోబర్ 6: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) వికలాంగులకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మద్దూరు మండలంలో వికలాంగులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government)అధికారంలోకి వచ్చి ఇంతకాలమైనా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వికలాంగుల పింఛన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.4,000 నుంచి రూ.6,000కు పెంచాలని, ప్రతి జిల్లాలో వికలాంగుల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి వికలాంగునికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే వికలాంగులకు కచ్చితంగా 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో జిల్లా NPRD అధ్యక్షురాలు రాధమ్మ, మండల కమిటీ సభ్యుడు డి. సాయిలుతో పాటు మండలంలోని పలువురు వికలాంగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.