జాతీయ ప్రతినిధుల సదస్సుకు బయలుదేరిన విద్యార్థి నాయకులు

06-10-2026 | 05:50pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 06 ( విజయక్రాంతి ) : హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) మంగళవారం నిర్వహించనున్న ఎంఎస్ఎఫ్ జాతీయ ప్రతినిధుల సదస్సుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థి నాయకులు(Madiga Student Federation ) పెద్ద సంఖ్యలో సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మడిపెల్లి శ్యాంబాబు, కో ఇంచార్జి జిల్లా ఇన్చార్జి మడిపెల్లి సుమన్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతూ,

విద్యారంగంలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, నాణ్యమైన విద్య కోసం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. జాతీయ స్థాయి ప్రతినిధులతో జరిగే ఈ సదస్సు విద్యార్థి ఉద్యమానికి మరింత దిశానిర్దేశం చేయడంతో పాటు, తెలంగాణలో విద్యార్థుల సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు