దేమికలాన్ సింగిల్ విండో చైర్మన్ గా వెంకట్ రెడ్డి బాధ్యతలు..

06-10-2026 | 05:59pm

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం దేమి కలాన్ సింగిల్ విండో చైర్మన్ గా ఏనుగు వెంకటరెడ్డి సోమవారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

దేమికలాన్ సింగిల్ విండో పరిధిలోని రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు. తాను ఒక రైతుగా రైతులకు సేవలు అందిస్తానని తెలిపారు. రైతులకు ఎరువుల సరఫరాలో, విత్తనాల సరఫరాలో తనవంతు బాధ్యతగా వ్యవహరిస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సింగిల్ విండో డైరెక్టర్లు మురళీమోహన్, చంద్రకళ, సిబ్బంది అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు