విద్యాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
చందుర్తి, సెప్టెంబర్ 23 ,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు(Intermediate students) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సామగ్రిలో భాగంగా బ్యాగులు, షూస్ పంపిణీ కార్యక్రమం బుధవారం రోజున నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్, నోట్‌బుక్స్, బ్యాగులు, షూస్ వంటి సదుపాయాలను కల్పిస్తోంది.
ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులకు ఉచిత బ్యాగులు, షూస్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ ఎం. విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సదుపాయాలను కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రిన్సిపాల్, కళాశాల అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు.