యువ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

20-09-2026 | 09:56pm

అన్నదానం మహాదానం.. యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి: సర్పంచ్‌ శేఖర్‌

కొల్చారం, సెప్టెంబరు 20:వినాయక నవరాత్రుల సందర్భంగా కొల్చారం మండల కేంద్రంలో యువ గణేష్ మండలి(Yuva Ganesh Mandali) ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ దేవన్నగారి శేఖర్‌, వార్డు సభ్యులు నేరెళ్ల సత్యనారాయణ, వనమాల శ్రీధర్‌, యాదగిరి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ దేవన్నగారి శేఖర్‌ మాట్లాడుతూ.. అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదని అన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువ గణేష్ మండలి సభ్యులను అభినందించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మహేశ్వర్‌ రెడ్డి, ఆశన్నగారి శ్రీశైలం, రాజేందర్‌ గౌడ్‌, యువ గణేష్ మండలి సభ్యులు రాజు, నవీన్‌, దుర్గాప్రసాద్‌, అనిల్‌, పాపయ్య, ఇమ్రాన్‌, రవి, హరికుమార్‌, వెంకట్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు