ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనసన్మానం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట్ మండలంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి,పాఠశాలల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం పొందినవారు. బి.వెంకటరాజు జిహెచ్ఎం జడ్పీహెచ్ఎస్ మాల్ తుమ్మెద,జి.మాణిక్యమ్మ పిఎస్.హెచ్ఎం ఎంపీపీఎస్ గోపాల్‌పేట్,ఎస్. శ్రీనివాస్ పిజిటి (Civics), టిజిఎంఎస్ నాగిరెడ్డిపేట్,జి. శోభ పిఈటి KGBV కెజిబివి నాగిరెడ్డిపేట్,ఎన్. సౌమ్య ఎస్జిటి ఎంపీపీఎస్ మాల్తుమ్మెద,ఎం.డి. రియాజ్ ఎస్జిటి MPUPS ఎంపియుపిఎస్ లింగంపల్లి కలాన్,పి. ప్రేమలత ఎస్జిటి ఎంపియుపిఎస్ నాగిరెడ్డిపేట్,డి. వనిత ఎస్జిటి ఎమ్పిపిఎస్ బొల్లారం,ఎస్. శంకర్ పిటిఐ. పిఎం.ఎస్హెచ్ఆర్ఐ బొల్లారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరిగిందని మండల ఎంఈవో వెంకటరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి, గోపాల్‌పేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్రామిరెడ్డి,వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






