తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన సన్మానం

20-09-2026 | 08:26pm

పాల్వంచ,సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్(Telangana SC ST Commission) చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నేనావత్ రాంబాబు నాయక్‌లకు ఆదివారం ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు.​ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ విద్యావేత్త బండి లక్ష్మణ్ గృహానికి విచ్చేసిన శుభ సందర్భంగా వారికి సాదర స్వాగతం పలికి, పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ​ఈ సందర్భంగా బండి లక్ష్మణ్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ఇంటికి విచ్చేసి ఆశీర్వదించినందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు, సభ్యులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు