బాలాజీ నగర్ లో ఘనంగా కుంకుమ పూజ, అన్నదానం

20-09-2026 | 08:00pm

జనగామ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పట్టణంలోని బాలాజీ నగర్ లో వినాయక మిత్ర బృందం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు(Ganesh Navratri celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గణనాథుడి వద్ద సామూహిక కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి - శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు