గణనాథుడి మండపంలో ఘనంగా కుంకుమార్చన

20-09-2026 | 01:45pm

బాన్సువాడ, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్‌(Beedi workers)కాలనీలో ఆదివారం కుంకుమార్చన(Kumkumarchana) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేసి అమ్మవారిని కొలిచారు. అనంతరం పరస్పరం కుంకుమను అందజేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కాలనీవాసులంతా సామూహికంగా పాల్గొనడంతో కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణంలో సందడిగా నెలకొంది.


మరిన్ని వార్తలు