టీటీడీ భూమి సమస్య పరిష్కారానికి కృషి చేసిన నేతలకు కృతజ్ఞతలు
ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని టీటీడీకి సంబంధించిన 1.12 గుంటల భూమి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి ఉపయోగపడే ఈ భూమికి సంబంధించి కొంతకాలంగా నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పరిష్కరించడం అభినందనీయమన్నారు. టీటీడీ భూమిని ప్రజా ప్రయోజనాలకు వినియోగించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, కల్యాణ మండపం నిర్మాణానికి అవసరమైన తదుపరి చర్యలను వేగవంతం చేయాలని సంజయ్ దాస్ గౌడ్ కోరారు.






