పరమేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా హరితహారం, అన్నదాన కార్యక్రమం
రామచంద్రపురం ఆగస్టు 22: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు(Senior leader of the BRS party) పరమేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా ఆయన స్నేహితులు, బంధువులు, అభిమానుల ఆధ్వర్యంలో రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి, లైబ్రరీలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి పరమేష్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవలో నిరంతరం ముందుండే పరమేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో వృద్ధులు, చిన్నారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి, లైబ్రరీలో హరితహారం చేపట్టినట్లు తెలిపారు.
పరమేష్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విశాల్, మహేందర్ రెడ్డి, భారతీనగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నవీన్ బూన్, పెద్ద రాజు, నర్సింగ్, కుమార్, శ్రీకాంత్ రెడ్డి, భాస్కర్, అలీ బాబా, రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.