విశాఖపట్నంలో ‘హిల్టన్ గార్డెన్ ఇన్’
2032లో ఏర్పాటుకు సిద్ధం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రముఖ గ్లోబల్ హాస్పిటాలిటీ సంస్థ హిల్టన్(Hilton, a leading global hospitality company), కపిల్ గ్రూప్‌నకు(Kapil Group) చెందిన బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌తో హిల్టన్ గార్డెన్ ఇన్ విశాఖపట్నం యెండాడ వరల్ ట్రేడ్ సెంటర్(Visakhapatnam Yendada World Trade Center) ఏర్పాటు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ హోటల్ 2032లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో హిల్టన్ తొలిసారిగా విశాఖపట్నంలో అడుగుపెట్టనుంది. వ్యాపార, విశ్రాంతి ప్రయాణాలు(Business and leisure travel) కలిసిపోతున్న ఈ మార్కెట్లో మా రుతున్న ప్రయాణికుల అవసరాలకు హిల్టన్ గార్డెన్ ఇన్ సేవలు అనుకూలంగా ఉండనున్నాయి.
ఈ కార్యక్రమంలో కపిల్ గ్రూప్ కంపెనీ బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ వి. కృష్ణయ్య, కపిల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ హోషాంగ్ గరివాలా, కపిల్ గ్రూప్ డైరెక్టర్ హరీతా రావు, హిల్టన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సౌత్ ఏషియా రీజినల్ హెడ్ జుబిన్ సక్సేనా, కపిల్ గ్రూప్ చైర్మన్ కె. వామన్ రావు, హిల్టన్ సౌత్ ఏషియా డైరెక్టర్ ఆశిష్ ఖన్నా పాల్గొన్నారు. యెండాడలో కపిల్ గ్రూప్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న ప్రతిష్ఠాత్మక 10 ఎకరాల వరల్ ట్రేడ్ సెంటర్ మిశ్ర మ వినియోగ ప్రాజెక్టులో ఈ హోటల్ భా గంగా ఉంటుంది. వ్యాపారం, సహకారం, అనుసంధానానికి కొత్త గమ్యస్థానంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
హిల్టన్ గార్డెన్ ఇన్ అందించే ప్రత్యేకమైన ‘బ్రైట్హార్టెడ్’ హాస్పిటాలిటీ, స్నేహపూర్వక సేవ లు, ఆలోచనాత్మక సౌకర్యాలు, అవసరాలకు అనుగుణంగా మార్చుకోగల ప్రదేశాలు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన విశాఖపట్నానికి అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 360 అతిథి గదు లు ఉంటాయి.
రోజంతా సేవలందించే రెస్టారెంట్, లాబీ లాంజ్ అండ్ బార్, రూఫ్టాప్ బార్, ఫిట్నెస్ సదుపాయాలు, ఇండోర్/అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటాయి. అలాగే సుమారు 14,300 చదరపు అడుగుల సమావేశాలు, ఈవెంట్ల స్థలం ఉంటుంది. ఇందులో బాల్రూమ్, బ్రేక్‌అవుట్ రూమ్‌లు, బోర్డ్రూమ్ ఉన్నాయి.