ఘనంగా హిమ్టెక్స్ 2026 ప్రారంభం
మాదాపూర్ హైటెక్స్‌లో ఐదు రోజుల పాటు ప్రదర్శన
పాల్గొననున్న 300 ఇంజినీరింగ్ సంస్థలు
హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 9వ ఎడిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ మెషిన్ టూల్ అండ్ ఇంజినీరింగ్ ఎగ్జిబిషన్ (హిమ్టెక్స్) 2026 ఘనంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన ఏస్ అర్బన్ గ్రూప్ అండ్ ఏఎం గ్రీన్ డైరెక్టర్ స్వాతి చలమలశెట్టి, రాజేష్ కుమార్ యాదవ్, అదనపు డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ డీఎఫ్‌వో, హైదరాబాద్ ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా తయారీ, ఇంజినీరింగ్ రంగాలకు చెందిన సుమారు 300 సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. మెషిన్ టూల్స్, రోబోటిక్స్, ఇంజినీరింగ్ సొల్యూషన్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగాల్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను హిమ్టెక్స్ 2026లో ప్రదర్శిస్తున్నారు.ప్రముఖ తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థలు, పరిశ్రమ నిపుణులు, నిర్ణయాధికారులు ఒకే వేదికపైకి రావడంతో కొత్త సాంకేతికతలను తెలుసుకునేందుకు వీలుగా ప్రదర్శన కొనసాగుతుంది






