8 June, 2026 | 2:33 PM

హిట్ ఆఫీసర్ షూట్ షురూ

14-09-2024 01:48 AM

స్టార్ హీరో నాని తన 32వ మూవీ ‘హిట్: ది థర్డ్ కేస్’లో ఆకర్షణీయమైన పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఇందులో హిట్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు నాని. ఈ క్యారెక్టర్ కోసం నాని కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో నాని తొలిరోజే షూట్‌లో జాయిన్ అయ్యారు. 2025, మే 1న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్ వర్గీస్; మ్యూజిక్: మిక్కీ జె మేయర్.