మీరిచ్చిన కార్డులెన్నీ?

28-09-2026 | 05:25am
  1. బీఆర్‌ఎస్ ఒక్క రేషన్ కార్డూ ఇయ్యలే
  2. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ నా మనసుకు దగ్గరైన పథకం
  3. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సన్నబియ్యం పథకం లేదు: మంత్రి ఉత్తమ్
  4. నేరేడుచర్లలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

నేరేడుచర్ల, సెప్టెంబర్27(విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు(Ration Card) ఇవ్వలేదని, ప్రజా పాలనలో పేద ప్రజల కడుపునింపే సన్న బియ్యం పథకం తనకు సంతృప్తినిచ్చిందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Civil Supplies Minister Uttam Kumar Reddy)అన్నారు. ఆదివా రం నేరేడుచర్ల పట్టణంలో నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల ప్రజలకు కలె క్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి ఆయ న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నా మనసుకు దగ్గరగా ఉన్న పథకం’ అని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ర్టంలోనూ సన్నబియ్యం పథకం లేదన్నారు. 10 సంవత్సరాల బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ ద్వారా పంపిణీ చేసిన దొడ్డుబియ్యం ప్రజలు తినలేకపోయారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సన్న వడ్ల రకాలకు బోనస్ ఇవ్వటంతో పాటుగా,

మన దగ్గర పండిన సన్న రకం వరిని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి, రేషన్ దుకాణాల ద్వారా మన తెలంగాణ పేదలకే పంపిణీ చేస్తున్నామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు భద్రతకు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం వల్ల కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవచ్చు అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 16.32,810 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామన్నారు. తెలంగాణలో మొత్తం కలిపి 1.06,28,092 రేషన్ కార్డులు ఉన్నాయని, దీంతో 3,42,57,109 మంది ఆహార భద్రత లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం కలిపి 3,72,658 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. 

రాహుల్ ప్రధాని కావడం ఖాయం.. 

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం అని మంత్రి ఉత్తమ్ జోస్యం చెప్పారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడి, ఎన్నికల్లో గెలుస్తుందని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు,

రాష్ట్ర అగ్రికల్చర్ కమిటీ సభ్యులు చెవిటి వెంకన్న, జిల్లా ఎస్పీ నరసింహ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ నూకల సందీప్ కుమార్ రెడ్డి, పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు, మాజీ ఎంపీపీ గోపాల్, మాజీ జెడ్పీటీసీ మోతిలాల్, గరిడేపల్లి మండల అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి, నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి తహసిల్దార్ సైదులు, వాజిద్, స్రవంతి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు పాల్గొన్నారు.

పేదలకు కొండంత అండగా సీఎంఆర్‌ఎఫ్..

హుజూర్‌నగర్: నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలకు చెందిన లబ్ధిదారులకు 5,319 మంది దాదాపు రూ.21.62 కోట్ల విలువైన చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఇప్పటివరకు 5,319 కుటుంబాలకు ఏకంగా రూ.21.62 కోట్ల మేర ఆర్థిక సాయం అందడం నియోజకవర్గ చరిత్రలోనే ప్రత్యేకమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు