జడల్ జర్నీలో లవ్ పార్ట్‌నర్‌గా కనిపిస్తా!
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్(Pan-India period action film) ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో, ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కయాదు లోహార్(Kayadu Lohar) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. ‘డ్రాగన్’ సినిమా చూసిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయగలనని శ్రీకాంత్ బిలీవ్ చేశారు. కథ చెప్పారు. తర్వాత లుక్ టెస్ట్ చేసి ఓకే చేశారు.
ఇది నా కెరీర్‌లో చాలా పెద్ద ప్రాజెక్ట్. ‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని అందరూ సుబ్బు అని పిలుస్తుంటారు. ఇందులో చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. జడల్ జర్నీలో లవ్ పార్టనర్‌గా కనిపిస్తాను. అలాగే నాకంటూ ఒక జర్నీ ఉంటుంది. అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నాది చాలా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర. కథలో చాలా కీలకమైన పాత్ర. నాని వెరీస్వీట్, హంబుల్ పర్సన్. ఆయన జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది. శ్రీకాంత్ చాలా డిఫరెంట్ డైరెక్టర్.
ఆయనలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. ఆయనకు గొప్ప విజన్ ఉంది. తనకి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. నాకు చాలా ఛాలెంజెస్ ఇచ్చారు. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతున్నాను. ఇందులో నాని క్యారెక్టర్ నా ఫేవరెట్. అలాగే మోహన్‌బాబు, రాఘవ్ క్యారెక్టర్స్ కూడా థియేటర్‌లో బ్లాస్ట్ అవుతాయి. నాకు యాక్షన్ సినిమాలు, స్పోర్ట్స్ సినిమాలు చేయాలని ఉంది. బయోపిక్ కూడా అవకాశం వస్తే చేయాలని ఉంది. ఇప్పుడు సూర్యతో ఒక సినిమా, మారి సెల్వరాజ్‌తో ఒక సినిమా చేస్తున్నాను’ అని తెలిపింది.