పాక్ కెప్టెన్‌పై ఐసీసీ చర్యలు
- ఫాతిమా సనాకు జరిమానా
- షెఫాలీని ఔట్ చేశాక ఓవరాక్షన్
దుబాయి, సెప్టెంబర్ 7 : ఆసియా కప్(Asia Cup)లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని(ICC Code of Conduct) ఉల్లంఘించినందు కు పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు(Pakistan womens cricket team) కెప్టెన్ ఫాతిమా సనాపై(Fatima Sana) ఐసీసీ క్రమశిక్షణా చర్యలు(ICC disciplinary actions) తీసుకుంది. ఆమెకు మ్యాచ్ ఫీజులో 10 శా తం జరిమానా విధించడంతో పాటు, డిసిప్లినరీ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను జోడించింది. ఆ మ్యాచ్‌లో రెండో ఓవర్ చివ రి బంతికి భారత ఓపెనర్ షఫాలీ వర్మను(Shafali Verma) ఫాతిమా సనా ఔట్ చేసింది.
ఆ తర్వాత పెవిలియన్ వైపు వెళ్లాలంటూ చేతులతో దూకు డుగా, కవ్వింపు చర్యలతో సైగలు చేయడం తో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆన్-ఫీల్ అంపైర్ల ఫిర్యాదు మేరకు మ్యాచ్ రిఫరీ సుప్రియా రాణి దాస్ ప్రతిపాదించిన ఈ శిక్షను, ఫాతిమా తప్పును అంగీకరించింది. దీంతో ఎలాంటి అధికారిక విచారణ అవస రం లేకుండానే ఈ వ్యవహారం ముగిసింది.