18 April, 2026 | 12:16 PM

Breaking News

హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •   మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి   •  

సమస్యను పక్కదారి పట్టించుటకే అక్రమ కేసులు

04-04-2025 10:18 PM

రైతుల పక్షాన పోరాడితే కేసుల.. అక్రమ కేసులను ఎత్తివేయాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి

భద్రాచలం,(విజయక్రాంతి): నకిలీ విత్తనాలతో రైతులు ఆత్మహత్య పాల్పడుతుంటే వారి పక్షాన పోరాడినందుకే అక్రమ కేసులు బనాయించి సమస్యని పక్కదారి పట్టిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. వెంకటాపురం బీజేపీ మండల అధ్యక్షులు రాజశేఖర్ పై నాటకీయంగా జరిగిన కుట్ర పరిణామాలు, కేసు నమోదు సంఘటనలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అన్నారు. శుక్రవారం భద్రాచలం లోని కుంజ ధర్మ ఇంటి వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి నాయకుడు పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ఆదివాసీ నాయకులు కుంజా ధర్మా మాట్లాడుతూ గత నెల 30న వెంకటాపురం మండలం, చిరుతపల్లి గ్రామంలో రైతుల ఆత్మహత్యలతో నకిలీ విత్తనాలకు వ్యతిరేఖంగా జరుగుతున్న పోరాటాన్ని ప్రక్కదారి పట్టించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు అన్నారు.

ఆ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న బీజేపీ నాయకునిపై అవినీతి కాంగ్రెస్ నాయకుల అండతో, పోలీసులు, కనీస విచారణ చేయకుండా, అక్రమంగా ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి పోరాటాన్ని అణగ తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివాసీ రైతుల ఆత్మహత్యల సంఘటనపై విచారణకు జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ విచ్చేస్తున్న సందర్భంగా ముందే సదరు నాయకులు పోరాటాన్ని నీరు కార్చి, నకిలీ విత్తనాలను అమ్మే వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనపై పోలీసులు , ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, రాజశేఖర్ పై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని, రైతులకు ఎక్స్-గ్రేషియా చెల్లించాలని, నాసిరకం విత్తనాలను అమ్మే వ్యాపారులపై, కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.