అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి
- సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సప్కం నాగేశ్వరావు
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బూర్గంపాడు సిపిఐ మండల కార్యదర్శి సప్కం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపాడు లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా కారణంగా మండలంలో శాంతిభద్రతలు సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా ఆయా గ్రామాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇసుక రవాణాపై ఎవరైనా ప్రశ్నించిన లేదా అడ్డుకున్న రవాణా దారులు మద్యం మత్తులో వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే అధికారులు స్పందించి, ఇసుక అక్రమ రవాణా తో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ లక్షలాది రూపాయలు గడిస్తున్న అక్రమాలకులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బూర్గంపాడు పంచాయతీలోని ప్రజలు, రైతులు సర్పంచ్ మందా నాగరాజుకు ఫిర్యాదు చేయగా అందుకు సానుకూలంగా స్పందించిన నాగరాజు తహశీల్దార్, ఎస్ఐ లకు అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిందిగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయటాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) బూర్గంపాడు మండలం సమితి స్వాగతిస్తూ అభినందనలు తెలియజేసింది. ప్రజల కోసం అన్యాయాలను అక్రమాలనుఅరికట్టడంలో సిపిఐ తరుపున మంద నాగరాజుకు పూర్తి మద్దతు తెలపడమే కాక భవిష్యత్తులో ప్రజా పోరాటాల నిర్వహించేందుకు కార్యచరణ రూపొందిస్తుందని ఆయన తెలిపారు.






