ఇమ్రాన్ సోదరి అరెస్ట్

21-09-2026 | 05:10am
  1.    27న నిరసనకు పాకిస్థాన్ తెహ్రీక్- ఏ -ఇన్సాఫ్ పిలుపు
  2. పోలీసుల చర్యను కోర్టులో ఎండగడతానన్న పీటీఐ చైర్మన్

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 20: పాక్ మాజీ ప్రధానమంత్రి(Former Prime Minister of Pakistan), తన సోదరుడు ఇమ్రాన్‌ఖాన్‌(Imran Khan)ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనకు సిద్ధమవుతున్న ఆయన సోదరి అలీమాను(Alima) ఆదివారం పోలీసులు లాహోర్‌(Lahore Police)లో అరెస్టు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యం(Imran Khan health)పై ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి స్థాయి వైద్య పరీక్షలు(Medical tests), చికిత్స కోసం ఆయనను ఇస్లామాబాద్‌లోని ప్రైవేట్ ‘షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్’కు తరలించాలని ఆయన పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్- ఏ -ఇన్సాఫ్’(పీటీఐ) డిమాండ్ చేసింది.

ఆయనను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 27న భారీ నిరసనలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆమె ఇంటివద్ద ఉన్న నలుగురు పీటీఐ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించటం, పోలీసులపై దాడి వంటి అభియోగాలను ఆమెపై పోలీసులు మోపారు.

శాంతియుత యాత్రగా ముందే తెలియజేసినా పోలీసులు ఇమ్రాన్ సోదరిని అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ చైర్మన్ బారిస్టర్ గోహర్ అలీఖాన్ పోలీసుల చర్యను తీవ్రంగా విమర్శించారు. ఈ చర్యను కోర్టులో సవాల్ చేస్తానన్నాడు. కాగా ఆడియాలా జైలులో శనివారం ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు