నత్తనడకన నాలా పనులు
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో పూర్తికాని డ్రైనేజీ, నాలా పనులు
- ప్రమాదకరంగా మారిన మ్యాన్ హోల్స్
- జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం
ఎల్బీనగర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): వానాకాలం పూర్తి కావోస్తున్న ఎల్బీనగర్ నియోజకవర్గం(LB Nagar constituency)లో పూర్తికాని డ్రైనేజీ, నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాలా పనులు అసంపూర్తిగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలంలో చేపట్టాల్సిన పనులను పూర్తి చేయడంలో జీహెచ్‌ఎంసీ అధికారులు(GHMC officials) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
మున్ముందు వర్షాలు కురిసే అవకాశం ఉన్నా డ్రైనేజీ, నాలా పనులను పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్యన నిర్లక్ష్యం తోపాటు సమన్వయం లోపం స్పష్టంగా కని పిస్తుంది. పనులు పూర్తి కాకపోవడంతో నా లా పనులు కొనసాగుతున్న ప్రాంతాలు ప్ర మాదకరంగా మారాయి. మీటర్ల లోతులో తీసిన నాలా, డ్రైనేజీ కాలువలు, మ్యాన్ హో ల్స్ గుంతలు మృత్యుకూహరంగా మారు తున్నాయి.
- వరద సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎన్ డీపీ పనులు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేప ట్టిన ఎస్‌ఎన్ డీపీ(స్ట్రాటెజిక్ నాలా అభివృ ద్ధి పథకం) నాలా పనులను వానాకాలం ప్రా రంభం కాకముందే చేపట్టారు. ముంపు ప్రాంతాల్లో వరద నీరు తరలింపు నాలా, బా క్స్ డ్రైన్ నిధులతో పాటు డ్రైనేజీ పైప్ లైన్లు పునరుద్ధరణ పనులు సైతం చేపట్టారు.
ఎస్ ఎన్ డీపీ నాలా పనులను వరద నీటి ప్రవా హాన్ని మళ్లించడానికి, వరద ముంపును నివారించడానికి అత్యంత ప్రాధాన్యతతో చేపట్టారు. నాలాల పునరుద్ధరణ, కొత్త బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం కోసం సుమారు రూ,114 కోట్ల నుంచి రూ, 122 కోట్ల వరకు నిధులను కేటాయించారు. వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నాగోల్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి మూసీ నది వరకు నాలాను అనుసంధానిస్తున్నారు. బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు ప్రధాన నాలా పనులు పూర్తయ్యాయి.
మన్సూరాబాద్ చిన్న చెరువు నుంచి బండ్లగూడ చెరువు అనుసంధాన మార్గంలో బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. హయత్ నగర్ బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ వరకు నాలా పనులు చేపట్టారు. దీంతో పాటు సరూర్ నగర్ చెరువు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలను నివారించేందుకు ఎస్‌ఎన్ డీపీ నాలా పనులు చేపట్టారు. సాగర్ రోడ్డు నుంచి బైరామల్గూడ చెరువు మార్గంలో భారీ స్టామ్ వాటర్ డ్రెయిన్ పనులు (బాక్స్ డ్రెయిన్లు, మ్యాన్హోల్) పురోగతిలో ఉన్నాయి.
- కొనసాగుతున్న నాలా పనులు
ఎల్బీనగర్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో నత్తనడకన నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయి. చంపాపేట డివిజన్ పరిధిలో ప్రధాన రహదారి వెంట చేపట్టిన పనులను పూర్తి కాగా, నాలాల పూడ్చివేత, మ్యాన్ హోల్స్ నిర్మాణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చంపాపేట డివిజన్ రెడ్డి కాలనీలో ప్రధాన నాలా అత్యంత ప్రమాదకరంగా మారింది. వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఆగమయ్య కాలనీ, అచ్యుత్య నగర్ కాలనీలో అసంపూర్తిగా పనులు ఉన్నాయి. హయత్ నగర్ డివిజన్ లో ప్రధాన నాలా పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో అనేక ప్రాంతాల్లో నాలా పైప్ లైన్ కుంగి కూలిపోయాయి. బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ డివిజన్లను అనుసంధానిస్తూ చేపట్టిన ప్రధాన నాలా పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతన పైప్ లైన్ వేయాలని ఆయా డివిజన్ల ప్రజలు కోరుతున్నారు.