బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్

21-09-2026 | 05:05am

కజకిస్తాన్‌పై 3-0తో విజయం

నగోయా, సెప్టెంబ్ 20 : ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు(Indian womens badminton team) అదిరిపోయే విజయంతో తమ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. సమిష్టిగా రాణించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16  మ్యాచ్‌లో భారత్ 3--0 తేడాతో కజకిస్తాన్‌(Kazakhstan)పై విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో భారత సింగిల్స్ షట్లర్లు(Indian singles shuttlers) వరుస గేముల్లో పూ ర్తి ఆధిపత్యం ప్రదర్శించి కేవలం 65 నిమిషాల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేశారు. స్టార్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది.

కజకిస్థాన్ ప్లేయర్ కమలియా స్మ గులోవాపై 21--7, 21-9 తో కేవలం 24 నిమిషాల్లోనే గెలిచి భారత్‌కు 1--0 ఆధిక్యా న్ని అందించింది. రెండో సింగిల్స్ మ్యాచ్‌లో యువ షట్లర్ ఉన్నతి హుడా 21--7, 21--10 తేడాతో అలిస్సా కులేషోవాను ఓడించి భారత్ ఆధిక్యాన్ని 2--0కు పెంచింది.  మూ డో మ్యాచ్‌లో 17 ఏళ్ల తన్వీ శర్మ 21--5, 21--10 తో డయానా నమెనోవాపై గెలుపొంది భారత్‌కు విజయాన్ని ఖాయం చేసింది.

భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో సెప్టెంబర్ 22న ఆతిథ్య జపాన్ జట్టు తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత మ హిళల జట్టుకు పతకం ఖాయమవుతుంది. కాగా 2022 ఆసియా క్రీడల్లో రజతం సాధించిన భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సోమవారం బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది.

మరిన్ని వార్తలు