మీకు ఇందిరమ్మ ఫ్లాట్ వచ్చిందా? వాట్సాప్కే అలాట్మెంట్ లెటర్స్
21-09-2026 | 06:43am
హైదరాబాద్: తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు కోసం వెయిట్ చేస్తున్న లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఇందిరమ్మ ఎల్ఐజీ ఫ్లాట్ల(Indiramma LIG Flats) లబ్ధిదారులకు అలాట్ మెంట్ లెటర్స్(Indiramma housing allotment letters) పంపనున్నారు. వాట్సాప్(WhatsApp) ద్వారా అలాట్ మెంట్ లెటర్స్ పంపనున్నట్లు హౌసింగ్ బోర్డు వెల్లడించింది. హౌసింగ్ బోర్డు వెబ్ సైట్ నుంచి కూడా అలాట్ మెంట్ లెటర్స్ పొందే అవకాశముంది. సోమవారం నాడు రాయదుర్గం ఇందిరమ్మ టవర్స్(Indiramma Towers) నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం మల్కం చెరువు వెనుక 2.85 ఎకరాల స్థలంలో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తోంది.