31 August, 2026 | 1:33 AM

ఇంటర్నేషనల్ క్లాసిక్ ఛాలెంజ్ విజేత జ్ఞానదత్తు

31-08-2026 12:00 AM

లాగోస్, ఆగస్టు30: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు(Indian badminton player) జ్ఞానదత్తు తలశిల(Gnanadatta Talasila) అంతర్జాతీయ వేదికపై సత్తాచాటాడు. నైజీరియాలో జరిగిన లాగోస్ ఇంటర్నేషనల్ క్లాసిక్ ఛాలెంజ్(Lagos International Classic Challenge) 2026లో మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవ సం చేసుకుని స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్‌లో హ్మార్‌లాల్థాజువాలాపై జ్ఞానదత్తు తల శిల 2109, 2220తో వరుస గేముల్లో విజ యం సాధించి చాంపియన్‌గా నిలిచాడు.

తొలి గేంలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన దత్తు.. రెండో గేంలో ప్రత్యర్థి నుంచి గట్టి పో టీ ఎదురైనా కీలక పాయింట్లలో రాణించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మెన్స్ సింగిల్స్ టైటిల్ సా ధించిన జ్ఞానదత్తు తలశిలకు బ్యాడ్మింటన్ వ ర్గాలు, క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు. ఈవిజయం భారత బ్యాడ్మింటన్‌లో యువ ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు.