‘హెలెన్ కెల్లర్స్’లో ఇంటర్నేషనల్ డెఫ్ డే
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): హెలెన్ కెల్లర్స్ ఇన్‌స్టిట్యూట్(Helen Keller Institute)లో ఇంటర్నేషనల్ డెఫ్ డే(International Deaf Day)ను ఘనంగా నిర్వహించారు. వి. బాల భాస్కర్ డిస్ట్రిక్ట్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మల్కాజ్‌గిరి సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి జి.ఎస్.ఎల్. ప్రి యాంక, ఎల్‌ఎల్బి నామినేటెడ్ మెంబర్ ఇంప్లిమెంటేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్కీ మ్స్ వి సురేష్ కుమార్ హాజరై, విద్యార్థులకు పిల్లల హక్కులు, దివ్యాంగుల హక్కులు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు.
ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్, --చైర్మన్ పటాన్ ఉమ్మర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘మా దగ్గర విద్యను అభ్యసిస్తున్నటువంటి వెయ్యి మంది డెఫ్ విద్యార్థుల హక్కులు, భద్రతకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. కా ర్యక్రమంలో డైరెక్టర్ డా. ఆర్ము గం, బీకాం ప్రిన్సిపాల్ జాజుల అంజయ్య, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీధర్ పాల్గొన్నారు.