ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ
- ఈస్ట్ జోన్ 708 ఆలౌట్
- కుమార కుశాగ్ర శతకం
- తేలిపోయిన సాత్జోన్ బౌలర్లు
- దులీప్ ట్రోఫీ ఫైనల్
* దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ పట్టు బిగించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగిన వేళ భారీ స్కోరు సాధించింది. అతనితో పాటు కుమార కుశాగ్ర కూడా శతకం సాధించాడు. సిరాజ్ లాంటి బౌలర్ ఉన్నా సౌత్‌జోన్ చేతులెత్తేసింది. మరి బ్యాటింగ్‌లోనైనా సత్తా చాటుతుందేమో చూడాలి.
చెన్నై , సెప్టెంబర్ 6 : దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్(Ishan Kishan) విధ్వంసం సృష్టించాడు. సౌత్ జోన్‌పై మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో(Double century) నిరంతరాయంగా బ్యాటింగ్ చేసై నా కారణంగా రెండో రోజు కాస్త అసౌకర్యానికి గురై రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. మళ్ళీ తిరిగి వచ్చి 270 రన్స్‌కు ఔట్ అయ్యాడు. 385/4 ఓవర్ నైట్ స్కోరుతో ఈస్ట్ జోన్ రెండో రోజు ఆటను ప్రారంభించింది. జార్ఖండ్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుషాగ్రా(Kumar Kushagra) అద్భుతమైన సెంచరీ తో కదం తొక్కాడు.
32 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగులు చేసి, ఇషాన్ కిషన్‌తో కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 230 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అనుకుల్ రాయ్ ఇషాన్‌తో అద్భుతం గా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ కలిసి 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అటు 270 బంతుల్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. తొలి రోజు ఆ టలో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. రెండో రోజు అదే జోరును కొనసాగించాడు.
204 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్.. 270 బంతు ల్లో ద్విశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్స్ చరిత్రలోనే డబుల్ సెంచరీ బాదిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. 1987లో అన్షుమన్ గైక్వాడ్ వెస్ట్ జోన్ కెప్టెన్‌గా.. నార్త్ జోన్ తో జరిగిన ఫైనల్లో 216 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత మరే సారథి ఈ ఘనతను అందుకోలేదు. 39 ఏళ్ల తర్వాత ఇషాన్ కిషన్ ఈ రికార్డును అందుకున్నాడు. ఓవరాల్‌గా దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ బాదిన ఏడో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు.
డబుల్ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఇషాన్ కిషన్.. భారీ సిక్సర్ల తో సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో 30 బం తుల వ్యవధిలోనే 250 పరుగుల మార్కును అందుకున్నాడు. ఆ వెంటనే తొడ కండరాలు పట్టేడయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మళ్ళీ చివరి సెషన్లో అతను బ్యాటింగ్‌కు వచ్చాడు. ట్రిపుల్ సెంచరీ పూర్తి చేస్తాడేమో అనుకుంటుండగా 270 (30 ఫోర్లు, 7 సిక్సర్లు) స్కోరు దగ్గర వెనుదిరిగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోరుకు ఆలౌ ట్ అయింది. శిఖర్ మోహన్(120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), అభిమన్యు ఈశ్వరన్(86 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 72) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 44) దూకుడుగా ఆడా డు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. సిరాజ్ పూర్తిగా తేలిపోయాడు.