సైన్స్ మిషన్లలో ఇస్రో భళా!
- అంతరిక్ష పరిశోధనల్లో భారత్ శక్తి అద్భుతం
- నాసాకు ఇస్రోతో కీలక భాగస్వామ్యం ఉంది
- భారతీయ-అమెరికా- ఉన్నతాధికారి అమిత్ క్షత్రియ
న్యూయార్క్, సెప్టెంబర్ 20: సైన్స్ మిషన్ల(Science missions)లో ఇస్రో భళాదూర్(Kudos to ISRO) అని, అంతరిక్ష పరిశోధన(Space Research)ల్లో భారత్ శక్తిసామర్థ్యాలు, సేవలు అద్భుతమని నాసాలోని భారతీయ-అమెరికన్ ఉన్నతాధికారి అమిత్ క్షత్రియ(Amit Kshatriya) అన్నారు. నాసాకు ఇస్రోతో ‘అద్భుతమైన’ భాగస్వామ్యం ఉందని, భవిష్యత్తులో మరింత సహకారం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఆర్టెమిస్ అకార్డ్స్ పై 70కి పైగా దేశాలతో పాటు భారతదేశం కూడా సంతకం చేసిందన్నారు.
ప్రఖ్యాత ‘ఇంట్రెపిడ్ మ్యూజియం(Intrepid Museum)’లో ఆదివారం జరిగిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్, చీఫ్ ఇంజనీర్ అయిన క్షత్రియ మాట్లాడారు. ఇప్పటికే తమకు ఇస్రోతో అద్భుతమైన సహకారం ఉందన్నారు. ‘సైన్స్ మిష న్లు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు ఈ రెండింటిలోనూ ఇస్రో అభివృద్ధి చేస్తున్న సామర్థ్యం చూడటానికి అద్భుతంగా ఉంది. మేము మరింత సహకారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని నాసాలో అత్యున్నత స్థాయి సివిల్ సర్వెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ క్షత్రియ పేర్కొన్నారు.
భూమి దాన్ని భూభాగం, మంచు, నీరు, వృక్షసంపదలో వచ్చే మార్పులను కొలవడం, అర్థం చేసుకోవడం లక్ష్యంగా జూలై 2025లో ప్రయోగించనున్న ‘ఎర్త్-సెన్సింగ్ ఆర్బిటర్’ (భూమిని పరిశీలించే ఉపగ్రహం) ప్రాజెక్ట్ అయిన నిసార్(నాసా ఇస్రో సింథటిక్ ఆపేచర్ రాడార్) గురించి ఆయన ప్రస్తావిం చారు. నిసార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. అది ఉమ్మడి కృషి వల్ల ప్రయోజనం పొందిందన్నారు. పౌర అంతరిక్ష అన్వేషణకు మార్గనిర్దేశం చేసే చట్టపరమైన కట్టుబాటు లేని సూత్రాల సమూహమైన ‘ఆర్టెమిస్ అకార్డ్స్ పై 70కి పైగా దేశాలతో పాటు భారతదేశం కూడా సంతకం చేసిందని పేర్కొన్నారు.
స్పేస్ షటిల్ కార్యక్రమానికి మార్గం సుగమం చేసిన నాసా నమూనా ఆర్బిటర్ ఎంటర్‌ప్రైజ్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇంట్రెపిడ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్యానెల్ చర్చలో ప్రసంగించడానికి క్షత్రియ నగరానికి వచ్చారు. క్షత్రియతో పాటు నాసా మాజీ నిర్వాహకుడు, వ్యోమగామి చార్లెస్ ఎఫ్ బోల్డెన్ జూనియర్, రికార్డులు సృష్టించిన వ్యోమగామి, ఆక్సియమ్ స్పేస్ డైరెక్టర్ ఆఫ్ హ్యూమన్ స్పేస్‌ఫ్ల్లుైటర్ పెగ్గీ విట్సన్ కూడా పాల్గొన్నారు.