నిర్మల్‌లో జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు

12-09-2026 | 05:55pm

భైంసా( విజయక్రాంతి): జన విజ్ఞాన(Peoples Science) వేదిక నిర్మల్ మహాసభలు ఆదివారం నిర్వహిస్తున్నట్టు సంఘ సభ్యులు తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే జిల్లా మహాసభల నిర్వహణ కోసం సన్నాహాక సమావేశం జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అంకం గంగాధర్, శేక్ రఫీక్ మాట్లాడుతూ.. మహా సభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల వర ప్రసాద్, వక్తలు అ.ప్రొ వెల్మల మధు ఎల్ నినో ఋతు పవనాల పై ప్రభావం, డిప్యూటీ ఎఫ్.ఆర్.ఓ.మహ్మద్ నజీర్ ఖాన్ అడవులు-వర్షాల నేస్తాలు, భూగర్భ జల భాండాగారాలు అను అంశంపై ప్రసంగిస్తారు అని, సైన్స్ ను ప్రచారం చేసే ఏకైక సైన్స్ ప్రచార సంస్థ అయిన జన విజ్ఞాన వేదికను అందరూ ఆదరించి ప్రోత్సాహించాలని తెలియజేశారు.

అదే విధంగా రేపు స్థానిక టి.ఎన్.జి.ఓ. భవన్ లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే జిల్లా మహా సభలకు సభ్యులు, విద్యావంతులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్, కొండా రాములు, చెకుముకి కన్వీనర్ గాజర్ల నారాయణ వర్మ, విద్య కమిటీ కన్వీనర్ గజపల్లి నర్సయ్య మొదలగు వారు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు