7 July, 2026 | 2:22 PM

జిందాల్ స్టెయిన్‌లెస్ లాభం 500 కోట్లు

16-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 15: జిందాల్ స్టెయిన్‌లెస్ 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 501 కోట్ల నికరలాభాన్ని ఆర్జించిం ది. గత ఏడాది ఇదేకాలంలో నమోదుచేసిన రూ.716 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఈ జనవరి 30 శాతం తగ్గింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ. 9,765 కోట్ల నుంచి 3.2 శాతం క్షీణించి రూ. 9,454 కోట్లకు తగ్గింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 2 చొప్పున డివిడెండు సిఫార్సుచేసింది. 2023 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జిందాల్ స్టెయిన్‌లెస్ కన్సాలిడేటెడ్ నికరలాభం 29 శాతం పెరిగి రూ.2,084 కోట్ల నుంచి రూ.2,693 కోట్లకు చేరింది.