3 September, 2026 | 9:02 PM

ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ

03-09-2026 | 08:18pm

హైదరాబాద్: చంచల్ గూడ్-సంతోష్ నగర్ స్టీల్ ఫ్లై ఓవర్(Steel flyover)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం చంచల్ గూడ్ జూనియర్ కాలేజీ(Chanchalguda Government Degree College)లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు.  గత సర్కార్  వంతెన నిర్మాణానికి సకాలంలో నిధులు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసి వంతెనను వేగంగా నిర్మాణం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతమంతా ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ అని సీఎం చెప్పారు.

ఒకప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు ఈసా, మూసీ నది(Musi River) నీళ్లు తాగేవారని, హైదరాబాద్ కు విదేశీయులేవరు వచ్చిన చార్మినార్(Charminar) వద్ద షాపింగ్ కు వస్తారని ఆయన గుర్తు చేశారు. పాతబస్తీలోని ప్రతి గల్లీ, అణువణువు నాకు తెలుసాని, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) పేరు చాలా దేశాల్లో సుపరిచితం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పోరాటానికైనా సిద్ధంగా ఉంటారు. మీరాలం ట్యాంక్(Miralam Tank)పై రూ.500 కోట్లతో కేబుల్ బ్రిడ్జి(Cable bridge) నిర్మిస్తున్నామని, అది పూర్తయితే రవాణా పరంగా, పర్యాటకంగా ప్రయోజనం ఉంటుందని సీఎం తెలిపారు. ఇప్పటికికే ఆరాంఘర్, మూసారాంబాగ్ వంతెనల నిర్మాణం పూర్తి చేశామని, పాతబస్తీ మెట్రోను పూర్తి చేస్తామని చెప్పాం.. చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు.

నాలాలపై ఆక్రమణలు తొలగిస్తామని, మురుగు సమస్య లేకుండా చేస్తాం. ఎక్కడైనా పేదల ఇళ్లు తొలగిస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కొన్ని శతాబ్ధాలుగా ఈ నగరంలో హిందూ ముస్లీంలు కలిసి జీవిస్తున్నారు. హిందూ ముస్లీంల సమిష్టి కృషితోనే ఈ నగరం అభివృద్ధి చెందుతూ వస్తోంది. మూసీ పునరుజ్జీవనం చేపడితే బీజేపీ(BJP) నేతలు తప్పు పడుతున్నారని, యూపీలో గంగానది(ganganadi), గుజరాత్ లో సబర్మతి నది ప్రక్షాళన చేపట్టాలేదా..? అని ముఖ్యమంత్రి అడిగారు. రాష్ట్ర బీజేపీ నేతలు గుజరాత్ కు గులాంగిరీ చేస్తున్నారని, బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కూడా పదేళ్లపాటు పాతబస్తీని పట్టించుకోలేదని రేవంత్ దుయ్యబట్టారు. పాతబస్తీ అభివృద్ధికి సహకరించకపోగా అడ్డుకుంటున్నారని, అంతేకాకుండా పాతబస్తీని మెట్రో, విమానాశ్రయంతో అనుసంధానం చేయటంలో నిర్లక్ష్యం చేశారు.