7 July, 2026 | 3:35 PM

Breaking News

పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   హోటళ్ళలో పరిశుభ్రత పాటించకుంటే జరిమాన తప్పదు   •   పెద్దకొత్తపల్లి కేజీబీవీ ఆకస్మిక తనిఖీ   •   కాళేశ్వరం 'కూళేశ్వరం'గా మారింది: మహేష్ గౌడ్   •   అన్ని వర్గాల ప్రజలకు అండగా ఎమ్మార్పీఎస్   •  

ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఫ్లాట్ లిస్టింగ్

16-05-2024 12:05 AM

ముంబై, మే 15: గతవారం ఐపీవో జారీచేసిన ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ బుధవారం ఫ్లాట్‌గా లిస్టయ్యింది. రూ.3,000 కోట్ల సమీకరణకు జారీఅయిన ఈ ఐపీవో 26 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రూ.300 ప్రైస్‌బ్యాండ్‌తో దీనిని జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆధార్ హౌసింగ్ 10 శాతం ప్రీమియంతో లిస్టవుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్‌ఎస్‌ఈలో ఫ్లాట్‌గా రూ.315 ధర వద్ద లిస్టయిన ఈ షేరు ఇంట్రాడేలో రూ.292 కనిష్ఠస్థాయిని తాకింది.  అయితే ఒక గంట ట్రేడింగ్ తర్వాత నష్టాల నుంచి కోలుకుని రూ.343 గరిష్ఠస్థాయికి చేరింది. చివరకు ఇష్యూ ధర రూ.315తో పోలిస్తే 4.6 శాతం లాభంతో రూ.329 వద్ద ముగిసింది.

తొలిరోజున గో డిజిట్ ఐపీవోకు స్పందన అంతంతే

 స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) బుధవారం ప్రారంభమయ్యింది. తొలి రోజున ఈఆఫర్‌కు 36 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యింది.  ఐపీవోలో 5.28 కోట్ల షేర్లను కంపెనీ జారీచేస్తుండగా, 1.89 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ.2,615 కోట్ల సమీకరణకు వస్తున్న ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ. 1,125 కోట్ల విలువైన 4.14 కోట్ల షేర్లను తాజా ఈక్విటీగా జారీచేస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.1,489 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. ఐపీవో ధరల శ్రేణిని రూ.258 నిర్ణయించారు. రిటైల్ విభాగంలో 1.44 రెట్లు స్పందన లభించగా, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్ల విభాగంలో 0.34 శాతం షేర్లకు బిడ్స్ వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి చివరిరోజున బిడ్స్ అందుతాయని అంచనా వేస్తున్నారు. ఆఫర్ మే 17న ముగుస్తుంది.