పాత వారికె కొలువులు!?

23-09-2026 | 05:20am
  1. సహకార ఎన్నికలపై నీలి నీడలు
  2. హైకోర్ట్ స్టేతో 128 పీఏసీఎస్‌లలో పాతవారికే బాధ్యతలు

కరీంనగర్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(Primary Agricultural Cooperative Societies) (పి ఏ సి ఎస్) ఎన్నికల పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు,  హైకోర్టు ఆదేశాల(High Court orders) నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాలని రైతులు(Farmers), వివిధ రాజకీయ పార్టీల నాయకులు(Leaders of political parties)  డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ సహకార కేంద్ర బ్యాంక్(Karimnagar District Cooperative Central Bank) పరిధిలో 128 పీ ఏసీఎస్ లలో చాలా చోట్ల అధ్యక్షులుగా హైకోర్టు స్టే తో మళ్ళీ పాఠవారే బాధ్యతలు స్వీకరించారు.   ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల , జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలకవర్గాల అసలు పదవీ కాలం 2025 ఫిబ్రవరి 14తో ముగిసింది.

గతంలో 2020 ఫిబ్రవరిలోఎన్నికైన ఈ కమిటీల గడువు ముగిసిన తర్వాత, ప్రభుత్వం వాటి కాలపరిమితిని రెండు విడతలుగా పొడిగించింది:మొదటి విడత 2025 ఫిబ్రవరి 14న ముగిసిన గడువును ప్రభుత్వం ఆరు నెలల పాటు 2025 ఆగస్టు 14 వరకు పొడిగించింది.రెండవ విడత: 2025 ఆగస్టు 14న ఆ గడువు కూడా పూర్తి కావడంతో, ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు 2026 ఫిబ్రవరి 14 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పొడిగింపు గడువు 2026 ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం 2025 డిసెంబరు 19న ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీఏసీఎస్ , డీసీసీబీ లకు పాలకవర్గాలను గడువుకు ముందే రద్దు చేసింది. వాటి స్థానంలో పరిపాలన సాగించడానికి ప్రభుత్వ అధికారులను పర్సన్ ఇన్ చార్జ్లుగా  నియమించింది.అయితే, ఈ రద్దు నిర్ణయంపై కొందరు పాలకవర్గ సభ్యులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు జోక్యంతో  పాత పాలకవర్గాలే తాత్కాలికంగా తిరిగి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.   

తాజాగా    హైకోర్టు ఉత్తర్వుల మేరకు కేడీసీసీబీ చైర్మన్గా కొండూరు రవీందర్రావు మరోసారి బాధ్యతలు స్వీకరించారు. 2005 నుంచి వరుసగా బ్యాంకు చైర్మన్గా ఎన్నికవుతున్న ఆయన, 2025 డిసెంబర్ 19న జీవో-598 ప్రకారం బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత కలెక్టర్లు ఇన్చార్జులుగా  వ్యవహరించారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 27న కొందరు సింగిల్ విండో చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించా రు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవో 598ను కొట్టివేస్తూ పాత జీవో 386 ప్రకారం పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కేడీసీసీబీ చైర్మన్ గా కొండూరు రవీందర్రావు చార్జ్ తీసుకున్నారు. పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో, పాత పాలకవర్గాలు తిరిగి బాధ్యతలు చేపత్తుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. సకాలంలో ఎన్నికలు జరగకపోవడం వల్ల నాబార్డు  అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, రాయితీలు రైతులకు అందడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది.

సహకార శాఖ వైపు నుంచి ఎన్నికల షెడ్యూల్ పైన అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. నామినేటెడ్ కమిటీలకు బదులుగా ప్రత్యక్ష ఎన్నికలు జరపాలని అన్ని వర్గాల నుండి డిమాండ్ వినోపిస్తుండటంతో ప్రభుత్వం ఎన్నికల వైపు మొగ్గుచూపుతుందా  లేదా చూడాలి.

మరిన్ని వార్తలు