ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జడ్జి

27-09-2026 | 12:11am

ఇల్లందు టౌన్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి(Principal Junior Civil Judge, Yellandu) స్వరూప కాటం శనివారం సాయంత్రం స్థానిక సబ్‌జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలు రికార్డులు(Prison records), పరిసరాలను పరిశీలించారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. వర్షాకాలంలో(Monsoon season) సీజనల్ వ్యాధులు(Seasonal diseases) వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించాలని తెలిపారు.

ఖైదీలకు మెనూ ప్రకారం భోజనం, ఇతర సదుపాయాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కోర్టు సూపరింటెండెంట్ శ్రీరంగం రామకృష్ణ, సబ్‌జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు